బుధవారం 03 జూన్ 2020
Cinema - May 02, 2020 , 13:48:16

మ‌న క‌థ ముగిసింది: రిషీ క‌పూర్ భార్య‌

మ‌న క‌థ ముగిసింది:  రిషీ క‌పూర్ భార్య‌

దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించిన రిషి కపూర్, నీతూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 1980లో వివాహ బంధంతో ఇద్ద‌రు ఒక్క‌టి కాగా,  వీరికి రణబీర్ కపూర్, రిథిమాకపూర్ సంతానం ఉన్నారు. ర‌ణ‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు కాగా, రిద్ధిమా డిజైన‌ర్‌గా స్థిర‌ప‌డింది. అయితే రిషీ క‌పూర్ గ‌త రెండేళ్లుగా లుకేమియాతో బాధ‌ప‌డుతుండ‌గా, ఆయ‌న‌ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంది నీతూ.

ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో రిషిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ,  అతడి కోసం అమ్మలా మారానని ఆ మధ్యన ఓ ఇంటర్య్యూలో వెల్లడించారు నీతూ. మూడో బిడ్డ‌లా రిషీని చూసుకుంద‌ట‌.  తినిపించడం, పడుకోబెట్టడం, మందులు ఇవ్వడం.. ఇలా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నా. ట్రీట్‌మెంట్ సమయంలో ఆయన అస్సలు తినేవారు కాదు. అది నన్ను చాలా బాధించింది. దీంతో ఆయన తినడం కోసం చాలా ట్రిక్స్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు రిషీ తోడు లేకుండా కాలం గడుపుతున్న నీతూ.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రిషీ చేతిలో మందు గ్లాసు ప‌ట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ... ఇక మ‌న క‌థ ముగిసింది అని పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజ‌న్స్ భావోద్వేగంతో కామెంట్స్ పెడుతున్నారు.

logo