మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 15:40:23

నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట‌కు 100 మిలియ‌న్ వ్యూస్

నీ క‌న్ను నీలి స‌ముద్రం పాట‌కు 100 మిలియ‌న్ వ్యూస్

దేవీశ్రీప్ర‌సాద్..త‌న సంగీతం, గాత్రంతో ఎంతోమంది మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను సంపాదించుకున్నాడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్. డీఎస్పీ సంగీతం విన్నారంటే అంద‌రిలో వైబ్రేష‌న్స్ రావాల్సిందే. చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ దేవీశ్రీ ప్ర‌సాద్ పాట‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. డీఎస్పీ పుట్టిన‌రోజు నేడు. బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న డీఎస్పీకి ఫ్యాన్స్ బ‌ర్త్ డే కానుక ఇచ్చారు. అదేంటంటే డీఎస్పీ కంపోజిష‌న్ లో వ‌చ్చిన నీ క‌న్ను నీలి స‌ముద్రం పాటకు సంగీత‌ప్రియులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

యూట్యూబ్ లో ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించింది. మార్చి 2న విడుద‌ల చేసిన ఈ వీడియో సాంగ్ 100 మిలియ‌న్ల వ్యూస్ మైల్ స్టోన్ ను అధిగ‌మించింది. హిందీ, తెలుగు లిరిక్స్ తో సాగే ఈ పాటను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు లిరిక్స్ ను శ్రీమ‌ణి రాయ‌గా..హిందీ లిరిక్స్ ను ర‌ఖీబ్ అల‌మ్ రాశాడు. జావెద్ అలీ, శ్రీకాంత్ చంద్ర పాడారు. ఈ పాట‌పై మీరు కూడా ఓ లుక్కేయండి. 

ఈ ఖ‌వ్వాలీ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడై మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేట్లు చేస్తోంది. అలాగే పాట‌లో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్‌, వాళ్ల ఎక్సెప్రెష‌న్స్ ముచ్చ‌ట‌గా అనిపిస్తున్నాయి. ఈ పాట‌కు శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ చ‌క్క‌ని సాహిత్యం అందించారు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు మ్యూజిక్‌పై ఉన్న అభిరుచి, పాట‌ల‌ను అత‌ను ప్రెజెంట్ చేసిన విధానం ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. అదేవిధంగా మ‌రో పాట 'ధ‌క్ ధ‌క్ ధ‌క్' ఇప్ప‌టివ‌ర‌కూ 18 మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించ‌డం గ‌మ‌నార్హం. ఉప్పెన‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు  క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను బుచ్చిబాబు అందించారు. సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్రలో న‌టిస్తోన్న‌ 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డి, థియేట‌ర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్న‌ద్ధంగా ఉన్నారు.


తారాగ‌ణం:

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  షామ్‌ద‌త్ సైనుద్దీన్‌

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.

సీఈవో: చెర్రీ

నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా

బ్యాన‌ర్స్‌:  మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo