బుధవారం 03 జూన్ 2020
Cinema - May 11, 2020 , 22:41:19

5 కోట్ల వీక్షణలు

5 కోట్ల వీక్షణలు

‘ఓ యువజంట ప్రేమకు సముద్రం వారధిగా నిలిచింది. ఆ ఇద్దరినీ ఏకం చేసింది. ఆ ప్రణయగాథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు  వైష్ణవ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. కృతిశెట్టి  కథానాయిక. విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారి. ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవప్రయాణం’ గీతాన్ని యూట్యూబ్‌లో యాభై మిలియన్లకుపైగా వీక్షించారు. శ్రీమణి, రఖీబ్‌ అలమ్‌ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావెద్‌ అలీ ఆలపించారు.  దేవిశ్రీప్రసాద్‌ బాణీలను అందించారు.  ‘ఈ పాటలో వైష్టవ్‌తేజ్‌, కృతిశెట్టి  కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తోంది. చక్కటి హావభావాలతో ఇద్దరూ ఆకట్టుకుంటున్నారు.  కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని  అలరిస్తుంది. ఈ సినిమాలోని మరో పాట ‘ధక్‌ ధక్‌ ధక్‌' 11 మిలియన్లకుపైగా వ్యూస్‌ను రాబట్టింది’ అని నిర్మాతలు తెలిపారు.  


logo