మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 15:18:10

దీపికా కోస్టార్స్‌కు స‌మ‌న్లు.. ఖండించిన ఎన్సీబీ

దీపికా కోస్టార్స్‌కు స‌మ‌న్లు.. ఖండించిన ఎన్సీబీ

మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దీపికా ప‌దుకొణేని కొద్ది రోజుల క్రితం ఎన్సీబీ విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ‌లో ఆమె నుండి కీల‌క ఆధారాలు రాబ‌ట్టారు అధికారులు. అయితే త‌న మేనేజ‌ర్‌తో దీపికా జ‌రిపిన వాట్సాప్ చాట్‌లో వాల్‌, మాల్‌, వీడ్‌, హాష్‌, డూంబ్ అనే పదాల‌ను ఉపయోగించార‌ని అవి వివిధ ర‌కాల సిగ‌రెట్ల కోసం స‌రాదాగా కోడ్‌తో పిలుచుకున్నార‌ని స్ప‌ష్టం చేసింది ఎన్సీబీ. దీపికా, ప్ర‌కాశ్‌ల‌ను వేర్వేరు గ‌దుల‌లో ఉంచి విచారించ‌గా, వారు ఇచ్చిన స‌మాధానాల‌కు ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందారని బీ టౌన్ మీడియా రాసుకొచ్చింది. 

అయితే ఏ, ఆర్, ఎస్ అనే అక్ష‌రం పేరుతో ఉన్న దీపికా కోస్టార్స్‌కు కూడా డ్ర‌గ్స్ కేసులో సంబంధం ఉంద‌ని, వారికి ఎన్సీబీ నుండి స‌మ‌న్లు వెళ్ళాయని చెబుతున్నారు. దీనిపై స్పందించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆ వార్త‌ల‌ను ఖండించింది.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంకి సంబంధించి జరిగిన‌ మాదకద్రవ్యాల దర్యాప్తులో ‘ఎ’, ‘ఆర్’, ‘ఎస్’ అనే అక్షరాలతో అగ్ర నటుల పేర్లు ఉన్న‌ట్టు వచ్చిన‌ వార్త‌లు అవాస్త‌వం అని ఎన్సీబీ పేర్కొంది. 


logo