ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 21, 2020 , 15:53:57

ర‌కుల్ కు నోటీసులు ఇవ్వ‌నున్న ఎన్సీబీ టీం..?

ర‌కుల్ కు నోటీసులు ఇవ్వ‌నున్న ఎన్సీబీ టీం..?

రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ వాడే వారి జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందంటూ ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ) విచార‌ణ‌లో చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సారాఅలీఖాన్‌, సిమోన్ ఖాంబ‌ట్టా పేర్ల‌ను కూడా చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ర‌కుల్ ప్రీత్‌సింగ్, సిమోన్ ఖంబ‌ట్టాకు నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్టు బీటౌన్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్ కు కూడా నోటీసులు అందించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే త‌న‌పై మీడియాలో వ‌స్తున్ అస‌త్య క‌థ‌నాల ప్ర‌సారాన్ని నిలిపేయాల‌ని కోరుతూ ర‌కుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. త‌న‌‌కు డ్ర‌గ్స్ తో సంబంధం లేద‌ని, తాను పొగ‌తాన‌ని, ఫిట్ నెస్ వ‌ర్క‌వుట్స్ , యోగా సెష‌న్ తో తాను ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలిని అవ‌లంభిస్తున్నాన‌ని ర‌కుల్ పిటిష‌న్ లో పేర్కొంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.