గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 11:04:47

ఆ ముగ్గురు భామ‌ల‌కు క్లీన్ చీట్ ఇచ్చిన‌ట్టేనా..!

ఆ ముగ్గురు భామ‌ల‌కు క్లీన్ చీట్ ఇచ్చిన‌ట్టేనా..!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. మాద‌క ద్య‌వ్యాల కేసులో ఇప్ప‌టికే సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ప‌లువురిని ఎన్సీబీ అదుపులోకి తీసుకోగా, వారి నుండి కీల‌క స‌మాచారం రాబ‌డుతున్నారు. రియా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ర‌కుల్‌, దీపికా ప‌దుకొణే, సారా అలీ ఖాన్ , శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బృందం విడివిడిగా విచారించింది.

అయితే  దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్‌ల‌తో పాటు దీపిక  మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్‌సిబి దాదాపు క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్టే అని ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపారు. 2017 వాట్స‌ప్ చాట్‌లో దీపికా, ఆమె మేనేజ‌ర్ వాట్స‌ప్ చాట్‌లో వాల్‌, మాల్‌, వీడ్‌, హాష్‌, డూంబ్ అనే పదాల‌ను ఉపయోగించార‌ని అవి వివిధ ర‌కాల సిగ‌రెట్ల కోసం స‌రాదాగా కోడ్‌తో పిలుచుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. స్లిమ్ సిగ‌రెట్స్ కోడ్‌గా హ్యాష్‌, మంద‌పాటి సిగ‌రెట్ల‌కు కోడ్‌గా వీడ్, త‌క్కువ నాణ్య‌త గ‌ల సిగరెట్ల‌ను మాల్ ఇలా ప‌లు రకాలుగా వారు పిలుచుకున్నారు. దీపికా, ప్ర‌కాశ్‌ల‌ను వేర్వేరు గ‌దుల‌లో ఉంచి విచారించ‌గా, వారిచ్చిన స‌మాధానా‌ల‌కు ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందార‌ట‌.  మ‌రి కొద్ది రోజుల‌లో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

రియా త‌న ఇంట్లో డ్ర‌గ్స్ దాచింద‌ని, తాను మాత్రం ఎప్పుడు డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ర‌కుల్ చెప్ప‌గా, దీనిపై ఎన్సీబీ అధికారులు మ‌రింత దృష్టి పెట్టారు. మ‌రోసారి ర‌కుల్‌ని విచారించి కీల‌క ఆధారాలు రాబ‌ట్టే అవ‌కాశం  ఉన్న‌ట్టు తెలుస్తుంది. 


logo