శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 08:17:59

సుశాంత్ కుక్‌ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ

సుశాంత్ కుక్‌ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ

సుశాంత్ కేసు విష‌యంలో మాద‌క ద్ర‌వ్యాల కోణంలో విచారిస్తున్న నార్కోటిక్ బ్యూరో స‌భ్యులు శ‌నివారం సాయంత్రం సుశాంత్ వంట‌మ‌నిషిని అరెస్ట్ చేశారు. సుశాంత్ హౌజ్ మేనేజ‌ర్ శామ్యూల్ మిరాండా..రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు షోయిక్ స్నేహితుడి ద్వారా దాదాపు ఏడు నెల‌లు దివంగ‌త న‌టుడుకి స‌ప్లై చేసిన‌ట్టు అంగీక‌రించాడు. సుశాంత్ కుక్ దీపేష్ సావంత్ కూడా డ్ర‌గ్స్ పంపిణీ చేశాడ‌ని ఆరోపించ‌డంతో ఎన్సీబీ అత‌నిని కూడా అరెస్ట్ చేసింది. 

దీపేష్‌ను ఈ రోజు కోర్టులో హాజ‌రు ప‌రిచే అవ‌కాశం ఉంది. ఇక ఈ రోజు రియాను కూడా ఎన్సీబీ విచారించ‌నుండ‌గా, ఆమెకు డ్ర‌గ్స్ కేసులో ఏదైన పాత్ర ఉందా అనే విష‌యాలు రాబ‌ట్టనున్నారు. ఇక షోయిక్, శామ్యూల్‌లను సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సిబి అదుపులో ఉండ‌నున్న సంగ‌తి తెలిసిందే . ఇదిలా ఉంటే రియా తండ్రి ఇంద్ర‌జిత్ చ‌క్ర‌వ‌ర్తి ఓ  ప్ర‌క‌ట‌న‌లో.. కంగ్రాట్స్‌ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు. ఈ వ‌రుస‌లో నా కుమార్తె పేరు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను. ఆ త‌ర్వాత ఎవ‌రున్నారో నాకు తెలియ‌దు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంపై మీ ప‌వర్ చూపిస్తున్నారు. న్యాయం త‌ప్ప‌క గెలుస్తుంది. కాని న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారు అని కామెంట్ చేశారు.