బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 04, 2020 , 13:05:15

అమ్మ‌వారిగా క‌నిపించ‌నున్న‌ న‌య‌నతార‌‌..!

అమ్మ‌వారిగా క‌నిపించ‌నున్న‌ న‌య‌నతార‌‌..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార త‌న కెరియ‌ర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. హీరోల‌కి జోడీగానే కాకుండా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో మూకుతి అమ్మన్ అనే చిత్రం చేస్తుంది. ఆధ్యాత్మిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార అమ్మవారిగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

తాజాగా న‌య‌న‌తార గెట‌ప్‌కి సంబంధించిన ప‌లు ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో మూకుతి అమ్మన్ గా న‌య‌న్ లుక్ అదిరిపోయింది. న‌య‌న‌తార ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మూకుతి అమ్మన్ చిత్రం ఒక పేద కుటుంబం చుట్టూ తిరుగుతుంది. క‌ష్టాల‌లో ఉన్న కుటుంబంకి మూకుతి అమ్మ‌న్ ఎలా స‌పోర్ట్‌గా ఉంటుంద‌నేది వెండితెరపై ఆస‌క్తిగా చూపించ‌నున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల చేయ‌మ‌ని, థియేట‌ర్‌లోనే చిత్రాన్ని వీక్షించాల‌ని స్ప‌ష్టం చేశారు బాలాజీ.
logo