మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 10:44:38

న‌య‌న‌తార డూప్‌.. ఫ్యాన్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన మిథు

న‌య‌న‌తార డూప్‌.. ఫ్యాన్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన మిథు

కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం రోజు 59 చైనా యాప్‌ల‌ని నిషేదించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మోస్ట్ పాపుల‌ర్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. ఈ యాప్‌లో సెల‌బ్రిటీల‌కి మిలియ‌న్ల‌కి పైగా పాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే బ్యాన్ విధించిన త‌ర్వాతి రోజు న‌య‌న‌తార మాదిరి ఉన్న ఓ మ‌హిళ అందరి దృష్టిని ఆకర్షించింది.  త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన మిథు విజిల్ అచ్చం న‌య‌న‌తార మాదిరి మేక‌ప్ వేసుకొని టిక్ టాక్ వీడియోలు చేసింది. అచ్చం లేడీ సూప‌ర్ స్టార్ మాదిరిగా ఉన్న మిథుని చూసి న‌య‌న‌తార అభిమానులు షాక‌య్యారు.

రూపంలోనే కాక ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా న‌య‌న‌తార మాదిరే ఇస్తుండ‌డంతో న‌య‌న్ అభిమానులు అవాక్క‌వుతున్నారు. పుతియా నియ‌మం, నాను రౌడీ దాన్ సినిమాల‌లో ఫేమ‌స్ డైలాగ్‌కి టిక్ టాక్ వీడియోలు చేసి అల‌రించింది మిథు విజిల్‌. ఈ వీడియోలు న‌య‌న‌తార కంట ప‌డితే ఎలా రెస్పాండ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.logo