కోలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రేమ జంట ఎవరంటే నయనతార, విఘ్నేష్ శివన్ అని ఠక్కున చెప్పొచ్చు. కొన్నాళ్లుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం, ఏ కార్యక్రమంలో పాల్గొవాలన్నా కూడా కలిసి పాల్గొనడం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నయనతార.. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కోలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సమంత కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు. ఇటీవల రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, రీసెంట్గా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిద్దరు వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.