పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. కెరీర్ తొలినాళ్లలో కమర్షియల్ సినిమాల్లో నటించిన ఈ మలయాళీ భామ.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్తోంది. అంతేకాదు.. ఒక్కో సినిమాకు ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ మిగిలిన హీరోయిన్లకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందుంటుంది. ఈమె ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటుంది నయనతార. ఇక ఇప్పుడు ఈ పారితోషికం మరింత పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు దక్షిణాదికే పరిమితమైన నయనతార.. తొలిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది. తమిళ అగ్ర దర్శకుడు అట్లీ షారుఖ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. కథలో దక్షిణాది నేపథ్యం ఉంటుందని.. అందుకే నయనతారను తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం నయనతారకు దాదాపు రూ.6 కోట్ల పారితోషికం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్‌లో 3 కోట్లు తీసుకునే నయన్.. ఇండస్ట్రీ మారిపోయేసరికి రెమ్యునరేషన్ డబుల్ చేసేసింది. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్లీ అదే రేంజ్ పారితోషికం.. ఇక్కడి నిర్మాతలు ఇవ్వాలంటే చుక్కలు తప్పవు. ఎందుకంటే.. బాలీవుడ్లో సినిమాకు రూ.6 కోట్లు తీసుకోనున్న నయనతార.. దక్షిణాది సినిమాలకు కనీసం రూ. 4కోట్లు డిమాండ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెళ్లి పీటలెక్కిన జబర్ధస్త్ కంటెస్టెంట్స్
కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఘనంగా శంకర్ కూతురి వివాహం.. హాజరైన సీఎం
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్