బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 23:00:26

నయనతార 20లక్షల విరాళం

నయనతార 20లక్షల విరాళం

కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమలోని దినసరి వేతన కార్మికులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో రోజువారి పోషణకు సైతం వారు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కార్మికుల్ని ఆదుకోవడానికి సినీ ప్రముఖలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాకు 20లక్షల విరాళాన్ని ప్రకటించింది. సినీ కార్మికుల్ని ఆదుకునే విషయంలో కథానాయికలు ఎక్కువగా స్పందించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నయనతార 20లక్షల విరాళంతో తన ఔదార్యాన్ని చాటుకుందని అంటున్నారు.

‘సీసీసీ’కి మైత్రీ మూవీ మేకర్స్‌ 5 లక్షలు

తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ 5లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. గతంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి మైత్రీమూవీమేకర్స్‌ 20లక్షల విరాళాన్ని ప్రకటించింది.


logo