శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 00:07:14

గోవాలో ప్రియుడితో విహారం

గోవాలో ప్రియుడితో విహారం

లాక్‌డౌన్‌ సమయాన్ని మొత్తం ప్రియుడు విఘ్నేష్‌శివన్‌తో కలిసి చెన్నైలోనే గడిపింది అగ్ర కథానాయిక నయనతార. తమ  అనుబంధాన్ని చాటే ఫొటోల్ని తరచు సోషల్‌మీడియాల్లో పంచుకుంటూ అభిమానుల్ని అలరించిందీ ప్రేమజంట. ఇటీవల జరిగిన ఓనమ్‌ ఉత్సవాల సందర్భంగా విఘ్నేష్‌శివన్‌ను కేరళలోని తన స్వస్థలానికి తీసుకెళ్లింది నయనతార. సంప్రదాయదుస్తుల్లో ఈ జంట చేసిన సందడి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ జంట గోవాలో విహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఎక్కువ భాగాన్ని చెన్నైలోనే గడిపిన ఈ ప్రేమికులు ఇప్పుడు గోవాలో ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేష్‌శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార  ఫొటోను షేర్‌ చేశారు. ‘నయనతారకు ఎంతో ఇష్టమైన గోవాకు విచ్చేయడం ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన వెకేషన్‌ తర్వాత గోవాకు రావడం కొత్త అనుభూతినిస్తోంది’ అని విఘ్నేష్‌శివన్‌ పేర్కొన్నారు.logo