శనివారం 11 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 18:28:35

సెల్‌ఫోన్‌లో చూస్తూ నవ్విన నయనతార..వీడియో

సెల్‌ఫోన్‌లో చూస్తూ నవ్విన నయనతార..వీడియో

అందాల బ్యూటీ నయనతార లొకేషన్‌లోకి వచ్చిందంటే సందడి వాతావరణం ఉంటుంది. సెట్స్‌లో ఉన్నపుడు సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ షూట్‌లో ఉన్నపుడు నవ్వుతున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. నయనతార మూవీ లొకేషన్‌లో ఉన్నపుడు ఫోన్‌లో చూస్తూ పగలబడి నవ్వింది. నయన్‌తోపాటు నివిన్‌ పాలీ, నటుడు అజు వర్ఘీస్‌, మిగతా టీం మెంబర్లు కూడా నవ్వుతుండటం వీడియోలో చూడొచ్చు.

ఫన్నీగా నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.  ధ్యాన్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివిన్‌ పాలీ హీరో కాగా..నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అజు వర్ఘీస్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 


View this post on Instagram

ഞാൻ മുങ്ങി ????

A post shared by Aju Varghese (@ajuvarghese) on


logo