ఆదివారం 12 జూలై 2020
Cinema - May 29, 2020 , 17:35:14

నేను రూ.30 కోట్లు అడిగానా..?: ఆలియా సిద్దిఖీ

నేను రూ.30 కోట్లు అడిగానా..?: ఆలియా సిద్దిఖీ

విడాకుల అంశంపై బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్దిఖీకి అతని భార్య ఆలియా లీగల్‌ నోటీసులు పంపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నవాజుద్దీన్‌కు మే 7న వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా లీగల్‌ నోటీసులు పంపించినట్లు ఆలియా లాయర్‌ అభయ్‌ సహాయ్‌ చెప్పాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. నవాజుద్దీన్‌ను ఆలియా విడాకులు, భరణం కింద రూ.30 కోట్లు డిమాండ్‌ చేయడంతోపాటు 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ ఇవ్వాలని అడిగినట్లు ఆన్‌లైన్‌లో పుకార్లు పుట్టుకొచ్చాయి. 

ఆలియా తన ఇద్దరు పిల్లల కోసం రూ.20 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని మరో నోట్‌ సారాంశం. అయితే ఈ పుకార్లను ఆలియా కొట్టిపారేసింది. అవన్నీ వట్టి పుకార్లేనంది. నా లాయర్లకు మీడియా సంస్థల నుంచి కాల్స్‌ వస్తున్నాయి. నా నోటీసుల కాపీ ఉందని ఎవరు చెప్పారు. అదంతా ఎవరో కావాలని సృష్టించిన కల్పిత కాపీ. ఎవరో ప్రాక్టీస్‌ కోసం కోసం ఇలా చేసి ఉండొచ్చని చెప్పింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo