గురువారం 04 జూన్ 2020
Cinema - May 24, 2020 , 11:32:46

భ‌ర్త‌పై నిప్పులు చెరుగుతున్న న‌వాజుద్ధీన్ భార్య‌

భ‌ర్త‌పై నిప్పులు చెరుగుతున్న న‌వాజుద్ధీన్ భార్య‌

బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్‌పై ఆయ‌న‌ భార్య ఆలియా గ‌త కొద్ది రోజులుగా నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇటీవ‌ల ఆయ‌నకి విడాకులు ఇస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన ఆమె సంసార విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది. న‌వాజుద్దీన్ కుటుంబ స‌భ్యులు త‌న‌ని మాన‌సికంగా, శారీరికంగా వేధించార‌ని చెప్పుకొచ్చింది. పిల్ల‌ల‌ని న‌వాజుద్దీన్ స‌రిగా ప‌ట్టించుకోడు. అందుకే వారు త‌న తండ్రి గురించి ఎప్పుడు అడ‌గ‌రంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది ఆలియా.

తాజాగా న‌వాజుద్దీన్ ఆటోబ‌యోగ్ర‌ఫీపై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది. న‌వాజుద్దీన్ త‌న ఆటోబ్ర‌యోగ‌ఫీలో ప్రియురాలి పేర్లు, స‌ర‌సాల గురించి ప‌బ్లిక్‌గా చెప్పుకొచ్చాడు. దీనిపై కొంద‌రు మ‌హిళ‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ మండిప‌డ్డారు. ఇలా రాయోద్ద‌ని తాను ముందే చెప్పాము. ఈ విష‌యంపై పోరాడాము కూడా. అయితే న‌వాజుద్దీన్ తాను చాలా గ్రేట్ అని  ఫీల‌వుతూ ఇలా రాసాడు. మీరు నిజాయితీ ప‌రులైతే ప్ర‌పంచం మిమ్మ‌ల్ని త‌ప్ప‌క గుర్తిస్తుంది అంటూ ఆలియా త‌న అభిప్రాయాలు వెల్లడించింది. 


logo