శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 18, 2020 , 21:58:27

విడాకులకు ఎన్నో కారణాలున్నాయ్‌: ఆలియా

విడాకులకు ఎన్నో కారణాలున్నాయ్‌: ఆలియా

న్యూఢిల్లీ: నవాజుద్దీన్‌ సిద్దిఖీ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ఆలియా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పదేండ్ల క్రితం పెండ్లి  చేసుకొన్న వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. తమ పెండ్లైన మరుసటి ఏడాది నుంచే తన సమస్యలు మొదలయ్యాయని ఆలియా వాదిస్తున్నది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ నుంచి విడిపోవడానికి కారణాలు చాలా  ఉన్నాయని, అన్నీ చాలా సీరియస్‌ అంశాలే అని పేర్కొన్నారు. కాగా, ఆలియా సిద్దిఖీగా చిరపరిచితులైన ఈవిడ.. తన పేరును అంజనా ఆనంద్‌ కిషోర్‌ పాండేగా రెండు నెలలక్రితం మార్చుకొన్నది. 

లాక్‌డౌన్‌ కారణంగా పోస్టాఫీసులు మూతపడి  ఉండటంతో  స్పీడ్‌పోస్ట్‌ ద్వారా నవాజుద్దీన్‌ సిద్దిఖీకి నోటీసులు పంపలేకపోయామని, విడాకులు ఇవ్వాల్సిందిగా గత నెల ఏడో తేదీన వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా నోటీసులు పంపినా పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు. నోటీసులు పంపి నెలన్నర రోజులు దాటిపోయినా సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. తన సోదరి మరణంతో చాలా కుంగిపోయి ఉన్న తమ కుటుంబం సోమవారం నాడే ఇంటికి వచ్చిందని నవాజుద్దీన్‌ సిద్దిఖీ చెప్తున్నారు.logo