శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 11:48:47

న‌వాజుద్దీన్ త‌మ్ముడిపై లైంగిక ఆరోప‌ణ‌లు

న‌వాజుద్దీన్ త‌మ్ముడిపై లైంగిక ఆరోప‌ణ‌లు

నవాజుద్దీన్ ఫ్యామిలీ సంచ‌‌లన‌ విష‌యాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం న‌వాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీని ప‌ట్టించుకోని ఆయ‌న నుండి త‌న‌కు విడాకులు కావాల‌ని నోటీసులు పంపింది. దీంతో వీరి ఫ్యామిలీ మేట‌ర్ బాలీవుడ్ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా న‌వాజుద్దీన్ తమ్ముడు వ‌రుస‌కి కూతురు వ‌రుస అయ్యే జ‌మీనాని లైంగికంగా వేధించాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వివ‌రాల‌లోకి వెళితే జ‌మీనా తాజాగా ఢిల్లీ పోలీసుల‌కి న‌వాజుద్దీన్ తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. 9 ఏళ్ళ వ‌య‌స్సులో చిన్నాన్న‌ న‌న్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు నాకు అవి అర్ధం కాలేదు. పెద్ద‌య్యాక అతడి గురించి తెలుసుకున్నాను. పెళ్లి త‌ర్వాత కూడా వేధించాడు.అత్తింటి వారిపై కూడా త‌ప్పులు కేసులు పెట్టి హింసించేవారు.  పెద్ద‌నాన్న (న‌వాజుద్దీన్‌)కి ఈ విష‌యం చెప్ప‌గా ..  ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు.  ఈ విష‌యంలో నాకు ఎవ‌రు అండ‌గా ఉండలేదు అని జ‌మీనా ఆవేద‌న వ్య‌క్తం చేసింది.


logo