శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 02:11:53

గురుశిష్యుల ప్రేమకథ

గురుశిష్యుల ప్రేమకథ

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. నిశ్రింకళ  ఫిల్మ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రామ్‌చరణ్‌ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఆవిష్కరించారు. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో క్లాసికల్‌ డ్యాన్సర్‌గా సంధ్యరాజు కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గురుశిష్యుల అనుబంధంతో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రమిది. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా హృద్యంగా సాగుతుంది. హంపి, లేపాక్షితో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు దేవాలయాల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. సంధ్యరాజు నటించిన తొలి సినిమా ఇది. ఆమె పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాను విడుదలచేయనున్నాం’ అని తెలిపారు. రోహిత్‌ బెహల్‌, ఆదిత్యమీనన్‌, శుభలేఖసుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, రచన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, దర్శకత్వం: రేవంత్‌ కోరుకొండ. 


VIDEOS

logo