నాని ఇప్పటి వరకు కెరీర్లో 25 సినిమాలు చేశాడు. కానీ లుక్ విషయంలో మాత్రం ఎప్పుడూ పెద్దగా ప్రయోగం చేసింది లేదు. అయితే గడ్డంతో కనిపించడం.. లేదంటే మీసాలతో కనిపించడం తప్పిస్తే కొత్తగా అయితే కనిపించలేదు. నిజానికి ఆయన ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉంటుందేమో కానీ లుక్స్ పరంగా మాత్రం పెద్దగా ఉండదు. గతేడాది వి సినిమాలో కాస్త కొత్తగా కనిపించాడు నేచురల్ స్టార్. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో వచ్చిన ‘వి’ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ‘టక్ జగదీష్’ సినిమాలో కూడా రొటిన్‌గానే కనిపిస్తున్నాడు నాని. కాకపోతే ఇందులో మిర్చిలో ప్రభాస్ మాదిరి నీట్‌గా టక్ చేసుకుని కనిపిస్తున్నాడంతే. కానీ ఇప్పుడు నాని లుక్ మాత్రం మామూలుగా లేదు. కోరమీసాలతో నాని లుక్ చూస్తుంటే అభిమానులకు మెంటల్ వచ్చేస్తుంది.
వామ్మో ఏంటిది ఇలా ఉన్నాడు.. పదునైన కత్తిలా ఉన్నాడుగా అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతగా అదిరిపోయే లుక్‌లోకి మారిపోయాడు ఈయన. ఈ లుక్ అంతా శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసమే. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నారు నిర్మాతలు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న శ్యామ్ సింగ రాయ్ కోసం రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం నాని చాలా కొత్తగా మారిపోయాడు. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నడూ లేనంత కొత్తగా ఉన్నాడు. టక్ జగదీష్ ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చిన నానిని చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు.
నాని లుక్ చూసి ఏమున్నావ్ సామీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈయన లుక్స్ మీద మీమ్స్ కూడా చేస్తున్నారు. కోర మీసాలను అలా తిప్పుతుంటే.. పులిలా ఉన్నావ్ కదా అంటూ నాని డై హార్డ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బయటి వాళ్లు కూడా నాని లుక్ చూసి బాగానే ఉన్నాడంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాపై అంచనాలు ఈ లుక్ తోనే సగం పెరిగిపోతున్నాయి. అప్పట్లో సింహా సినిమాపై ఎలాగైతే బాలయ్య లుక్ అంచనాలు పెంచేసిందో.. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయి పల్లవి, కృతి శెట్టి ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తున్నారు. ఎంసీఏ తర్వాత మరోసారి నానితో కలిసి నటిస్తుంది సాయి పల్లవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి