తన భార్య గర్భవతిగా ఉన్నా కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టి చాలా జోష్‌తో ఆడుతున్నాడు నటరాజ్ మాస్టర్. అయితే రీసెంట్గా నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం వేడుకలు జరగగా, అందుకు సంబంధించి వీడియో చూపించారు. అందులో నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త అని నీతూ చెప్పడంతో తెగ ఎమోషనల్ అయ్యాడు.
హమీదా, శ్రీరామ్‌లు రాత్రి సమయంలో పలువిషయాలపై ముచ్చటించుకున్నారు. నీ మైండ్‌లో ఉన్నది బయటకు చెప్పేయ్ అని శ్రీరామ్ అనడంతో కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది హమీదా. దీంతో కొద్ది సేపు ఆమెను సముదాయించాడు.
నీకు,మానస్ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కావచ్చు. కాని మన మధ్య ఉంది, ఫ్రెండ్షిప్ లేదంటే అంత కన్నా, ఎక్కువ తక్కువ కూడా అయి ఉండొచ్చు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో హమీదాకు నవ్వు వచ్చేసింది. మరి ఇద్దరిమధ్య ఏ రిలేషన్ ఉందనేది రానున్న రోజులలో బయట పడుతుందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ రోజు శనివారం కావడంతో నాగ్‌తో సందడి ఓ రేంజ్లో ఉంటుంది.