శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 09:12:59

న‌టాషా చెల్లికి కూడా సోకిన కరోనా

న‌టాషా చెల్లికి కూడా సోకిన కరోనా

బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ న‌టాషా సూరికి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని న‌టాషా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ... ఆగ‌స్ట్ 1న ప‌నిమీద పూణే వెళ్లాం. ఆ స‌మ‌యంలో నాతో పాటు నా చెల్లి రూపాలి, బామ్మ ఉన్నారు. ప్ర‌స్తుతం వారు అనారోగ్యంగా ఉన్నారు. అతి త్వ‌ర‌లో మేమంతా కోలుకుంటాం అని పోస్ట్ పెట్టింది నటాషా.

తాజాగా న‌టాషా చెల్లి రూపాలికి కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యం రూపాలి సోషల్ మీడియా వేదికగా ఆమె  ఫోటో పోస్ట్ చేసి పేర్కొంది. "నాకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. గత కొద్ది రోజులుగా నాకు జ్వరం ముక్కు సమస్యతో పాటు గొంతు సమస్య అలాగే నాలుక రుచి కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది. బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌, యోగా చేస్తున్నాం. కోవిడ్ మ‌న‌ల్ని చాలా డిస్ట‌ర్బ్ చేస్తుంది. పాజిటివ్ మైండ్‌తో ప్రారంభ ద‌శ‌లోనే కోవిడ్‌ను జ‌యించ‌వ‌చ్చ‌ని నేను న‌మ్ముతున్నాను అంటూ రూపాలి చెప్పుకొచ్చింది 


logo