బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 17:32:23

వివాదాస్ప‌ద పాత్ర‌లో న‌ట‌కిరీటి..!

వివాదాస్ప‌ద పాత్ర‌లో న‌ట‌కిరీటి..!

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్విరాజ్‌, శ్రీరెడ్డి, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం క్లైమాక్స్. మ‌ల్టీ జోన‌ర్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. అయితే ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ వివాదాస్ప‌ద పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి విదేశాల‌కు పారిపోయిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా రోల్ లో న‌ట‌కిరీటి క‌నిపించ‌నున్నార‌ట‌. శ్రీరెడ్డి ఈ చిత్రంలో త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌నుంద‌ట‌.

ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని విధంగా విభిన్నమైన పాత్ర‌లు సినిమాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించునున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేట‌ర్లు రీఓపెన్ అయిన వెంట‌నే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. భ‌వానీ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీ రాజేశ్వ‌ర్ రెడ్డి, కే క‌ర‌ణాక‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo