శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 00:12:38

నల్లమల రహస్యం

నల్లమల  రహస్యం

అమిత్‌ తివారి, భానుశ్రీ, నాజర్‌  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’.  రవిచరణ్‌ దర్శకుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఎరుపెక్కే గగనమిది..రవికెరుగని గ్రహణం..’ అనే గీతాన్ని సీనియర్‌ నటుడు నాజర్‌ బుధవారం హైదరాబాద్‌లో విడుదలచేశారు. పెద్దపల్లి రోహిత్‌ సంగీతాన్ని సమకూర్చారు.  నాజర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను కీలక పాత్ర పోషించా. చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రంలో నటించిన అనుభూతినిచ్చింది’ అని తెలిపారు. ‘నల్లమల అడవి చుట్టూ  దాగి వున్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ తెరకెక్కుతున్న చిత్రమిది. ధైర్యవంతమైన ప్రయత్నంగా నిలుస్తుంది. తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశమిది.  ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’ అని నిర్మాత చెప్పారు. తనికెళభరణి, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


logo