మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 00:41:11

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘నరుడి బ్రతుకు నటన’

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘నరుడి బ్రతుకు నటన’

‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధాశ్రీనాథ్‌ జోడీ చక్కటి కెమిస్ట్రీతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ జంట కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’.   సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమల్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టైటిల్‌ పోస్టర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది ప్రచార చిత్రంలో హృదయరూపంలోని ఆకృతిలో ఓ జంట  కనిపిస్తున్నారు. హెడ్‌ఫోన్స్‌, బ్లూకలర్‌ హార్ట్‌ సింబల్‌ ఆసక్తిని పంచుతున్నాయి. సంగీతప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిదని తెలుస్తోంది. ‘దీపావళి సమయంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్‌ కృష్ణ వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు’ అని చిత్రబృందం తెలిపింది.   ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు. 


logo