మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 18:57:42

అక్టోబ‌ర్ 24న బాల‌కృష్ణ 'న‌‌ర్త‌న‌శాల' రీమేక్ వీడియో రిలీజ్

అక్టోబ‌ర్ 24న బాల‌కృష్ణ 'న‌‌ర్త‌న‌శాల' రీమేక్ వీడియో రిలీజ్

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ 2004లో న‌ర్తన‌శాల రీమేక్ ను మొద‌లుపెట్టిన‌ విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ‌, సౌంద‌ర్య‌తోపాటు  శ్రీహ‌రి, శ‌ర‌త్‌కుమార్‌, ఉద‌య్ కిర‌ణ్, ఆశిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయితే సినిమా కొంత‌భాగం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో సౌంద‌ర్య  మ‌ర‌ణించ‌డంతో  సౌంద‌ర్య మృతితో షూటింగ్ నిలిచిపోయింది. సినిమాలో ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య‌ను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పిన బాల‌కృష్ణ..న‌ర్త‌న‌శాల‌ను నిలిపేశాడు.

అయితే న‌ర్త‌న‌శాల రీమేక్ కోసం షూట్ చేసిన కొన్ని స‌న్నివేశాల‌తో కూడిన పుటేజీని బాల‌కృష్ణ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  తాజా స‌మాచారం ప్ర‌కారం సుమారు 17 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను శ్రేయాస్ ఈటీ యాప్ లో అక్టోబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్నారు. న‌ర్త‌న‌శాల రీమేక్ లో బాల‌కృష్ణ అర్జునుడిగా, కీచ‌కుడిగా రెండు పాత్రల్లో న‌టించారు. సౌంద‌ర్య ద్రౌప‌దిగా న‌టించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.