ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 19:04:19

మ‌డ్ బాత్ సెష‌న్ లో న‌ర్గీస్ ఫ‌ఖ్రీ...ఫొటోలు వైర‌ల్

మ‌డ్ బాత్ సెష‌న్ లో న‌ర్గీస్ ఫ‌ఖ్రీ...ఫొటోలు వైర‌ల్

ఇంతియాజ్ అలీ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన రాక్ స్టార్ చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది అమెరిక‌న్ భామ న‌ర్గీస్ ఫ‌ఖ్రీ. ఆ త‌ర్వాత మ‌ద్రాస్ కేఫ్, కిక్, అజ‌ర్ తోపాటు ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలో స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. న‌ర్గీస్ త‌న స్నేహితుడితో క‌లిసి మ‌డ్ బాత్ సెష‌న్ కు వెళ్లింది.

చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా ఉండేందుకు , శ‌రీరంలోని విష‌పూరిత ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించేందుకు "రెడ్ మ‌డ్ బాత్" చాలా గొప్ప‌గా ప‌నిచేస్తుంది. మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. స్నేహితుడు టైల‌ర్ ఆర్యాయ్‌తో మంచి రోజు అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో మ‌డ్ బాత్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo