ఆదివారం 31 మే 2020
Cinema - May 01, 2020 , 10:35:50

న‌రేష్ త‌న‌యుడు ఎంతగా మారిపోయాడో చూశారా..!

న‌రేష్ త‌న‌యుడు ఎంతగా మారిపోయాడో చూశారా..!

90ల‌లో కామెడీ హీరోగా స‌త్తా చాటిన న‌రేష్ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే నాలుగేళ్ళ క్రితం న‌రేష్‌ కుమారుడు  నవీన్ విజయ్‌కృష్ణ  ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో మ‌ళ్ళీ అలాంటి ప్ర‌యత్నం చేయ‌లేదు. నిజానికి ఎడిట‌ర్‌గా ఉన్న న‌వీన్ హీరోగా ఎద‌గాల‌నే కోరిక‌తో సినిమా చేశారు.

నందిని న‌ర్సింగ్ హోమ్ సినిమాలో స్లిమ్‌గా క‌నిపించిన న‌వీన్ ఇప్పుడు  చాలా లావుగా గుర్తు ప‌ట్ట‌కుండా మారాడు. న‌రేష్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో కొడుకుతో దిగిన ఫోటోని షేర్ చేయ‌గా, ఇందులో న‌వీన్ పూర్తిగా మారిపోయిన‌ట్టు క‌నిపించాడు. లాక్‌డౌన్ ఎఫెక్టేమో అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న ఫామ్ హౌజ్‌లో కుమారుడితో క‌లిసి ఉన్న న‌రేష్ బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్ బైక్‌తో చ‌క్క‌ర్లు కొట్టారు . ఇది న‌వీన్ బైక్ అని చెప్పిన న‌రేష్ బైక్‌లపై తనకు ఉన్న మక్కువ తన కుమారుడికి కూడా వచ్చిందని  ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో తాను హోండా సీబీ 125 వాడానని, అలాగే ‘ప్రేమ సంకెళ్లు’ సినిమాలో యమహా 125 స్క్రాంబ్లర్ నడిపానని.. కానీ, తన కొడుకు బైక్ మాత్రం అద్భుతమని నరేష్ వెల్లడించారు.  


logo