మంగళవారం 02 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 09:49:16

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై న‌రేష్ స్పంద‌న‌

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై న‌రేష్ స్పంద‌న‌

గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని, దీనిని న‌రేష్ నిర్మించ‌నున్న‌ట్టు అనేక వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు విజ‌య నిర్మ‌ల కోసం నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ని క‌లిసార‌ని, ఇందులో న‌టించేందుకు ఆమె బాగా డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి

తాజాగా విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై న‌రేష్ స్పందించారు. ప్ర‌స్తుతం అమ్మ బ‌యోపిక్‌ని తీయాల‌నే ఆలోచ‌న లేదు. ఎవరికీ కూడా ప‌ర్మీష‌న్స్ ఇవ్వ‌లేదు అని న‌రేష్ తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై వ‌స్తున్న పుకార్ల‌కి బ్రేక్ ప‌డింది 


logo