గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 00:09:13

మోదీ బయోపిక్‌ ‘మనోవిరాగి’

మోదీ బయోపిక్‌ ‘మనోవిరాగి’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మనోవిరాగి’. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల చేస్తున్నారు. ఎస్‌.సంజయ్‌ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్‌ జైన్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేశారు. మోదీ పాత్రలో అభయవర్మ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను  మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్‌నగర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ప్రదేశాలలో పూర్తిచేశారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లైకా అధినేత ఎ.సుభాస్కరన్‌ మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి మోదీ జీవితంలోని అనేక మలుపులు ఈ చిత్రంలో ఉంటాయి. ఆయన జీవితకథతో సినిమా నిర్మించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు.


logo