గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 09:13:58

రియా ఇంట్లో ఎన్సీబీ బృందం త‌నీఖీలు..!

రియా ఇంట్లో ఎన్సీబీ బృందం త‌నీఖీలు..!

నిషేధిత మాదకద్రవ్యాల కోసం డ్రగ్స్‌ డీలర్లతో వాట్సాప్‌లో సంభాషించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తిపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డు (ఎన్సీబీ) ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ తీసుకోవ‌డం లేద‌ని గతంలో రియా పేర్కొన‌గా, సుశాంత్ మేనేజ‌ర్ శృతి మోదీ మాత్రం రియా,సుశాంత్‌లు క‌లిసి మారిజోనా డ్ర‌గ్స్‌ను తీసుకునే వార‌ని సీబీఐకి చెప్పిన‌ట్టు స‌మాచారం.  

తాజాగా నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన ఐదుగురు అధికారులు ముంబైలోని రియా ఇంటికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలానే  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు శామ్యూల్ మిరాండా ఇంటిని కూడా ఎన్సీబీ బృందం క్షుణ్ణంగా త‌నిఖీ చేయ‌నున్నార‌ట‌.  కాగా,  శామ్యూల్ మిరండా, సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తి   కొన్ని సంద‌ర్భాల్లో క‌లిసి డ్ర‌గ్స్ సేవించేవార‌ని శృతి మోదీ చెప్ప‌డంతో ఎన్సీబీ బృందం ఇత‌నిపై కూడా దృష్టి పెట్టింది


logo