మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 19:22:29

సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్‌..!

సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్‌..!

లాక్‌డౌన్ కాలంలో వేలాది మంది నిరాశ్ర‌యుల‌కు అండ‌గా నిలిచి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. సోనూసూద్ గొప్ప హృద‌యానికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. సాయం చేయాల‌న్న సంక‌ల్పం ఉంటే చాలు ఎంత‌మందికైనా అండ‌గా నిలువొచ్చ‌ని నిరూపించాడు సోనూసూద్‌. ఈ యాక్ట‌ర్ కు గౌర‌వసూచ‌కంగా మ‌హారాష్ట్ర‌లోని వ‌షీమ్ ప్రాంతానికి చెందిన నారాయ‌ణ్ కిష‌న్ లాల్ వ్యాస్‌ సైక్లిస్ట్‌ 2 వేల కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

నారాయ‌ణ్ కిష‌న్ లాల్ వ్యాస్ నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ...సామాజిక‌, జాతీయ సమ‌స్య‌ల మీద ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా సైక్లింగ్ చేస్తున్నా. ఈ సారి సోనూసూద్ కు సైక్లింగ్ ను అంకిత‌మిస్తూ..ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు 2 వేల కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేయ‌నున్న‌ట్టు తెలిపాడు. మ‌హారాష్ట్ర నుంచి రామ‌సేతు వ‌ర‌కు వ్యాస్ ప్ర‌యాణం  సాగ‌నుంది.  వ‌షీమ్‌-హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు-మ‌ధురై-రామ‌సేతు మార్గాల ద్వారా 2 వేల కిలోమీట‌ర్ల సైక్లింగ్ ను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించాడు.

ఈ న్యూస్ కాస్తా సోనూసూద్ వ‌రకు చేరింది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ..త‌న కోసం నారాయ‌ణ్ కిష‌న్ లాల్ వ్యాస్ చేయాల‌నుకుంటున్న రైడ్..తాను ఎప్ప‌టికీ పొంద‌లేని అతి పెద్ద పుర‌స్కారం అని అన్నాడు. సోనూసూద్ ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవితో క‌లిసి ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo