e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సినిమా నీదైన దాని కోసం పోరాడు

నీదైన దాని కోసం పోరాడు

నీదైన దాని కోసం పోరాడు

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ట్రైలర్‌ను బుధవారం విడుదలచేశారు. ఇందులో వెంకటేష్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు భిన్న పాత్రల్లో కనిపించారు. ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు..డబ్బుంటే లాగేసుకుంటారు.. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు సిన్నప్ప’ అంటూ ట్రైలర్‌లో వెంకటేష్‌ చెప్పిన సంభాషణలు హృదయాల్ని హత్తుకుంటున్నాయి. తన కుటుంబాన్ని, తనయుడిని కాపాడుకోవడం కోసం వెంకటేష్‌ పడే తపన, సాగించిన పోరాటం నేపథ్యంలో ఆసక్తికరంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ‘నీదైన దాని కోసం పోరాటం చెయ్యి..సరైన సమయంలో’ అంటూ ట్రైలర్‌ను ఉద్దేశించి వెంకటేష్‌ వ్యాఖ్యానించారు. తమిళ చిత్రం ‘అసురన్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియమణి, కార్తిక్త్న్రం, రావురమేష్‌, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నీదైన దాని కోసం పోరాడు
నీదైన దాని కోసం పోరాడు
నీదైన దాని కోసం పోరాడు

ట్రెండింగ్‌

Advertisement