శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 06, 2020 , 16:57:37

నారా రోహిత్ పెయింటింగ్‌.. ఫిదా అయిన నెటిజ‌న్స్‌

నారా రోహిత్ పెయింటింగ్‌.. ఫిదా అయిన నెటిజ‌న్స్‌

యువ హీరో నారా రోహిత్ రీసెంట్‌గా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రావ‌డం రావ‌డంతోనే త‌న టాలెంట్‌ని చూపించి నెటిజ‌న్స్‌చే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన రోహిత్ శివుని పెయింటింగ్‌ని చాలా చ‌క్క‌గా వేశాడు.  ఇన్నాళ్లు త‌న‌లో దాగి ఉన్న టాలెంట్‌ని ఒక్క‌సారిగా  అభిమానుల ముందు పెట్టేస‌రికి ఫిదా అవ్వ‌డం వారి వంతు అయింది. 

ఇన్నాళ్ళు బొద్దుగా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు స్లిమ్‌గా మారాడు. రీసెంట్‌గా త‌న మేకొవ‌ర్ గురించి వివ‌రించాడు.  ఇంతక ముందు నా బాడీ తీరు న‌చ్చ‌లేదు.  అందుకే  ఒక సంవత్సరం విరామం తీసుకొని వ‌ర్క‌వుట్స్ చేశాను. లాక్డౌన్ కారణంగా జిమ్ మూసివేయబడింది. అందుకే  ప్ర‌స్తుతం కార్డియో వ్యాయామాలు చేస్తున్నాను.  తక్కువ కార్బొహైడ్రేట్స్ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. నారా రోహిత్ లుక్ ఫ్యాన్స్‌కి మాంచి థ్రిల్‌ని క‌లిగిస్తుంది


logo