సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 15:38:43

పుష్ప‌లో నారారోహిత్ కీ రోల్‌..!

పుష్ప‌లో నారారోహిత్ కీ రోల్‌..!

క‌రోనా ఎఫెక్ట్ తో అత‌లాకుత‌ల‌మైన స‌నీప‌రిశ్ర‌మ మెల్ల‌మెల్ల‌గా కోలుకుంటోంది. త‌మ సినిమాల షూటింగ్స్ షురూ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు, డైరెక్ట‌ర్లు. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు పుష్ప షూటింగ్ ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. యువ న‌టుడు నారా రోహిత్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. నారా రోహిత్ పేరును అల్లు అర్జున్ సూచించాడ‌ట.

రంగ‌స్థ‌లంలో ఆదిపినిశెట్టి రోల్ లాగే నారా రోహిత్ పాత్ర ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. హిట్టు, ప్లాఫ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే నారా రోహిత్ ఈ సారి కీ రోల్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడ‌న్న‌మాట‌. నారా రోహిత్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నారు సినీ ల‌వ‌ర్స్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo