శనివారం 06 జూన్ 2020
Cinema - May 05, 2020 , 10:40:56

త‌న మేకొవ‌ర్ గురించి వివ‌రించిన నారా రోహిత్

త‌న మేకొవ‌ర్ గురించి వివ‌రించిన నారా రోహిత్

ఒక‌ప్పుడు లావుగా ఉండే నారా రోహిత్ ప్ర‌స్తుతం పూర్తిగా మారాడు. త‌న న్యూ లుక్‌కి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. కొత్త సినిమా కోసం రోహిత్ ఇలా మారాడంటూ జోరుగా ప్ర‌చారం కాగా,ఆ సినిమా ఏంటీ, ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే వివ‌రాలు లాక్‌డౌన్ త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని అన్నాడు.

ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, నారా రోహిత్ త‌న మేకొవ‌ర్ గురించి వివ‌రించాడు.  ఇంతక ముందు నా బాడీ తీరు న‌చ్చ‌లేదు.  అందుకే  ఒక సంవత్సరం విరామం తీసుకొని వ‌ర్క‌వుట్స్ చేశాను. లాక్డౌన్ కారణంగా జిమ్ మూసివేయబడింది. అందుకే  ప్ర‌స్తుతం కార్డియో వ్యాయామాలు చేస్తున్నాను.  తక్కువ కార్బొహైడ్రేట్స్ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఏదైమ‌న నారా రోహిత్ లుక్ ఫ్యాన్స్‌కి మాంచి థ్రిల్‌ని క‌లిగిస్తుంది


logo