శనివారం 28 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:16

అంటే.. సుందరానికి!

అంటే.. సుందరానికి!

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘అంటే...సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు. మలయాళ కథానాయిక నజ్రియా ఫహాద్‌ ఈ సినిమా ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది. టైటిల్‌ ప్రకటన సందర్భంగా చిత్ర బృందం డైలాగ్‌ వీడియోను విడుదల చేసింది. ఇందులో  నాని ఓ వ్యక్తితో రహస్యంగా చెవిలో ఓ ముచ్చటను పంచుకోవడం..అనంతరం సదరు వ్యక్తి అంటే..సుందరానికి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ‘ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ నేపథ్యంలో అందరిని అలరిస్తుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించే  సినిమా ఇది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా అరుణ్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.