కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేసి అండగా నిలిచారు ఫ్రంట్ లైన్ వర్కర్స్. కరోనా కాటేస్తున్న సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ముందువరుసలో నిలిచి ప్రశంసలందుకున్నారు డాక్టర్లు. వారి కోసం టాలీవుడ్ హీరో నాని ఓ స్పెషల్ వన్ తో అందరి ముందుకు రాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు నాని.
మన హీరోల కోసం అంటూ మ్యూజిక్, డాక్టర్, లవ్ ఎమోజీలను ఉంచాడు నాని. ఈ స్టార్ పోస్ట్ చేసిన స్టిల్ ను గమనిస్తే నాని హ్యాండ్ కెమెరాను పట్టుకుని డిస్ప్లేను గమనిస్తున్నాడు. అతని చుట్టూ కొంతమంది ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో అందరూ మాస్క్ లు పెట్టుకున్నారు. ఇంతకీ నాని ఇచ్చిన హింట్ తో..అతడేమైనా తెల్ల కోటు (డాక్టర్ )వేసుకోబోతున్నాడా..? అంటూ ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మరి నాని ఏం అనౌన్స్ మెంట్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!