శనివారం 06 జూన్ 2020
Cinema - May 04, 2020 , 08:57:10

చిరు సినిమా గురించి నాని చెప్పే సంగ‌తులు..!

చిరు సినిమా గురించి నాని చెప్పే సంగ‌తులు..!

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు తెర‌కెక్కించిన చిత్రం‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ . చిరంజీవి, శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమా హైద‌రాబాద్‌లోని ‘ఓడియన్ 70 MM’ థియేటర్‌లో ఏడాది పాటు అల‌రించిన విష‌యం తెలిసిందే. చిత్రంలో జ‌గ‌దేక వీరుడిగా చిరంజీవి, ఇంద్రుడి కుమార్తె అతిలోకసుందరి ఇంద్రజగా శ్రీదేవి , విల‌న్ పాత్రలో అమ్రేష్ పూరీ ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదాన్ని అందించారు 

చిత్ర నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్ ఆధారంగా జంధ్యాల క‌థ‌ని సిద్ధం చేయ‌గా,  కే.రాఘవేంద్రరావు త‌న‌దైన స్టైల్‌లో తెర‌కెక్కించి వావ్ అనిపించారు. ఈ చిత్రం  మే 9వ తేదితో 30 యేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను  నాని వాయిస్ ఓవర్‌తో  ఈ నెల 5, 7, 9 తేదిల్లో రానున్న‌ట్టు అశ్వినీద‌త్ తెలిపారు. ఎవర్ గ్రీన్ క్లాసిక్‌ సినిమాగా రూపొందిన జ‌గ‌దేకవీరుడు అతిలోక సుందరి చిత్రంకి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల‌లో చిత్ర బృందం త‌మ జ్ఞాప‌కాల‌ని పంచుకున్న విష‌యం తెలిసిందే. ఇళ‌య‌రాజా చిత్రానికి బాణీలు స‌మ‌కూర్చారు.logo