బుధవారం 03 జూన్ 2020
Cinema - May 20, 2020 , 23:26:20

కొత్త దర్శకుడితో

కొత్త దర్శకుడితో

కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తూ సినిమాల్ని చేస్తుంటారు నాని. తాజాగా ఆయన మరో వినూత్న  చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఓడెల దర్శకుడిగా పరిచయం కానున్నారు.  సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ‘దర్శకుడు సుకుమార్‌ వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ ఓడెల అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించనున్నారు.  కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో నాని కనిపించనున్నారు. త్వరలో ఈ చిత్రానికి  సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. నాని నటిస్తున్న  చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా ప్రభావంతో మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. అలాగే రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌సింఘరాయ్‌' సినిమా చేయబోతున్నారు నాని. logo