కోల్‌కతా నేపథ్యంలో జరిగే పీరియాడిక్ కథాంశంతో నాని కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. ఇందులో నాని బెంగాలీ యువకుడిగా కనిపించనున్నారు. అతను ఏం ఆశించి తెలుగునేలపై అడుగుపెట్టాడు? ఈ క్రమంలో శ్యామ్‌సింగరాయ్ తెలుసుకున్న నిజాలేమిటన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అంటున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకులముందుకురానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘శ్యామ్సింగరాయ్గా నాని ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ఆయన పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగుతుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నాని కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినమ్ గోమఠం, జిషుసేన్‌గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, కథ: సత్యదేవ్ జంగా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.