కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎంత ప్రళయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహమ్మారి వలన సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా మృత్యువాత పడ్డారు. అయితే కరోనా నుండి కాపాడుకోవడానికి మనకున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని అటు ప్రభుత్వాలు ఇటు సెలబ్రిటీలు చెబుతున్నారు.
తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాని, అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేసి.. మనకుంది ఈ రెండు ఆప్షన్లే. వీటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోండి.. అంటూ 1. వ్యాక్సిన్ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. 2. మన క్షేమం కోసం వ్యాక్సిన్ వేయించుకుందాం.. అని పోస్ట్ చేశారు. కాగా, నాని ఇటీవ దారే లేదా అంటూ ఫ్రట్ లైన్ వర్కర్స్ ఈ కరోనా టైంలో పడుతున్న బాధలను తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది.