సోమవారం 01 జూన్ 2020
Cinema - May 13, 2020 , 08:11:40

2020లో ఏమేం చూడాల్సి వస్తుందో.. నాని ఫ‌న్నీ ట్వీట్

2020లో ఏమేం చూడాల్సి వస్తుందో.. నాని ఫ‌న్నీ ట్వీట్

2020 చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. కంటికి క‌నిపించ‌ని వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేస్తుండ‌గా, ఎంద‌రో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది అనాధ‌లు అయ్యారు.  ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిని గ‌తంలో ఎన్న‌డు చూడ‌లేద‌ని చెబుతున్నారు. అయితే కరోనా వైర‌స్ వ‌ల‌న‌ ఈ సంవ‌త్స‌రం విషాదాంతంగా మిగిలిపోగా, ఈ స‌మ‌యంలోనే కొన్ని షాకింగ్స్ న్యూస్ అంద‌రి నోరెళ్ల‌పెట్టేలా చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం దిల్ రాజు రెండో పెళ్లి అంద‌రికి షాకింగ్‌గా మార‌గా, ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న మ‌న భ‌ళ్ళాల‌దేవుడు ప్రేయ‌సి వ‌ల‌లో ప‌డ్డ‌ట్టు చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లోనే మిహీక‌ బజాజ్‌ని వివాహం చేసుకోనున్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపించారు. ఇక నాని కాస్త ఫ‌న్నీగా వారికి విషెస్ అందించాడు.  ఈ 2020 సంవత్సరంలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందోనంటూ చమత్కరిస్తూ..గ‌తంలో   'హమారా బజాజ్' అంటూ సాగే పాత వాణిజ్య ప్రకటన తాలూకు వీడియోను  అంకితం చేస్తున్నానని అన్నాడు. రానా పెళ్లాడబోతున్న అమ్మాయి ఇంటిపేరు 'బజాజ్' (మిహీక బజాజ్) కావడంతో నాని ఆ ప్ర‌క‌ట‌న‌కి సంబంధించిన వీడియో షేర్ చేశారు.logo