టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. టక్ జగదీష్ (Tuck Jagadish Trailer)ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ బరువు బాధ్యతలు చూసుకునే బాధ్యత గల కుమారుడిగా నాని కుటుంబ సమస్యలను ఎలా అధిగమించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మూవీలో కుటుంబ బావోద్వేగాలు ఎక్కువగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఈ చిత్రంలో జగపతిబాబు (Jagapathi Babu)నానికి అన్నగా నటిస్తున్నాడు. ఐశ్వర్యారాజేశ్ (Aishwarya Rajesh) సోదరిగా నటిస్తోంది. ఇక మరోవైపు నాని, రీతూ వర్మ కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ కథ, భావోద్వేగాలు సమపాళ్లలో పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించడం ఖాయంగానే అనిపిస్తుంది.
మరి ట్రైలర్ తో అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ శివ నిర్వాణ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ పండించబోతున్నాడనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న విడుదల కానుంది టక్ జగదీష్.
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్