టాలీవుడ్ యాక్టర్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. టక్ జగదీష్ తోపాటు శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు ప్రస్తుతం నాని ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే విడుదల కావాల్సిన టక్ జగదీష్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది. అయితే కొన్ని రోజులుగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
బిజీ షెడ్యూల్ పెట్టుకుని నాని త్వరగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. శ్యామ్‌సింగరాయ్ చిత్రీకరణ పూర్తయినట్టు వీడియో ద్వారా తెలిపాడు నాని. చివరి రోజు..శ్యామ్ పాత్రకు ముగింపు అంటూ నాని చేతిలో ట్రిమ్మర్ పట్టుకుని శ్యామ్ సింగరాయ్ గెటప్ లో ఉన్న మీసాన్ని తీసేశాడు. ఇక నెక్ట్స్ ‘అంటే సుందరానికి’ పాత్రలో జాయిన్ అవబోతున్నట్టు చెప్పాడు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో నజ్రియా నజిమ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..