అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. గుర్తింపు కోసం కొన్నేళ్ల పాటు కష్టపడ్డాడు. ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా మార్కెట్ మాత్రం అంతగా రాలేదు. నాని సినిమా అంటే ఏదో 10 కోట్లు వస్తాయిలే అనుకునే వాళ్లు. అలాంటి సమయంలో ఈయన నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా నానిని ఒక్కసారిగా క్రేజీ హీరోగా మార్చేసింది. అప్పటి వరకు సెకండ్ గ్రేడ్ సినిమాలు చేస్తాడు.. డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయంటూ దర్శకుడు మారుతిని తక్కువ అంచనా వేసారంతా. దాంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈయన తెరకెక్కించిన సినిమా భలే భలే మగాడివోయ్. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. నాని కెరీర్ టర్నింగ్ సినిమా భలే భలే మగాడివోయ్ ఒకటి రెండు కాదు.. పెట్టిన పెట్టుబడికి మూడింతలు వసూలు చేసింది. నానిని న్యాచురల్ స్టార్ గా మార్చేసింది. సెప్టెంబర్ 4, 2015న విడుదలైన ఈ చిత్రం ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భలే భలే మగాడివోయ్ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం..
నైజాం: 7.10 కోట్లు
సీడెడ్: 2.10 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.15 కోట్లు
ఈస్ట్: 1.55 కోట్లు
వెస్ట్: 1.05 కోట్లు
గుంటూరు: 1.65 కోట్లు
కృష్ణా: 1.30 కోట్లు
నెల్లూరు: 0.50 కోట్లు
ఏపీ + తెలంగాణ ఫుల్ రన్ కలెక్షన్స్: 17.40 కోట్లు (31.85 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.60 కోట్లు
ఓవర్సీస్: 6.11 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 27.11 కోట్లు షేర్ (50 కోట్ల గ్రాస్)
భలే భలే మగాడివోయ్ సినిమాను అప్పట్లో నాని మార్కెట్ ప్రకారం దాదాపు 9 కోట్లకు బిజినెస్ చేశారు. దానికి మూడు రెట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ ఒక్క సినిమా తర్వాత నాని రేంజ్ మారిపోయింది. వరస విజయాలతో సత్తా చూపించాడు. ఓవర్సీస్లో అయితే మీడియం బడ్జెట్ సినిమాలకు సరికొత్త రికార్డులు సెట్ చేసింది భలే భలే మగాడివోయ్ సినిమా. ఇప్పటికీ నాని కెరీర్లో లాభాల పరంగా ఈ చిత్రమే టాప్ బ్లాక్ బస్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
నాని కెరీర్ టర్నింగ్ సినిమా భలే భలే మగాడివోయ్