మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 02:35:57

‘సారథి’ గా నందమూరి తారకరత్న

 ‘సారథి’ గా నందమూరి తారకరత్న

నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్‌ దర్శకుడు. నరేష్‌యాదవ్‌, వై.ఎస్‌. కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వరరావు నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా తారకరత్న ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ను విడుదలచేశారు.  నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రీడానేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది.  తారకరత్న పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు.టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది.  కథాబలమున్న మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. ఆ కోవలోనే మా సినిమా నిలుస్తుందనే నమ్మకముంది. త్వరలో ట్రైలర్‌ను విడుదలచేస్తాం’ అని తెలిపారు.