హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటాడు. తన లాంటి పెద్ద హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటే.. వేలాది మంది కార్మికులు పని చేసుకుంటూ హాయిగా ఉంటారని నమ్ముతాడు బాలయ్య. అందుకే ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే దసరాకు ట్రిపుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ .
ఎలాగో అఖండ సినిమా దసరా పండక్కి రానుంది. ఇక అదే పండక్కి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల చేసేట్టుగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు గోపిచంద్ మలినేని. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. వేటపాలెం నేపథ్యంలో బాలయ్య తెరకెక్కిస్తున్నాడు గోపి. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు నట సింహం.
గోపీచంద్ మలినేని సినిమాతో పాటు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా దసరాకు రాబోతుంది. చాలా సంవత్సరాలుగా ఈ సినిమా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు అనిల్. దీని తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఏదేమైనా దసరాకు ఒకేసారి మూడు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతూ అభిమానులకు నిజమైన పండగ తీసుకొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
lahari shari | ఇంతకీ లహరి షారి ఎవరు.. బిగ్ బాస్‌కు ఎలా వచ్చింది..?
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా
MAA Elections | మంచు విష్ణు Vs ప్రకాశ్ రాజ్ .. మా అధ్యక్ష ఎన్నికలను అలా సెట్ చేశారన్నమాట..