శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 19:53:57

35 ఏళ్లుగా ఆటోలోనే షూటింగ్‌కి!

35 ఏళ్లుగా ఆటోలోనే షూటింగ్‌కి!

బాలీవుడ్‌లో సహజనటుడిగా పేరొందిన నానాపటేకర్‌ గురించి తెలియని సినీ ప్రియుడు వుండడు. జాతీయ ఉత్తమనటుల జాబితాలో ముందు వరుసలో వుండే ఈ నటుడు సినిమా ల్లోఎంతో సహజంగా వుంటాడో.. నిజజీవితంలో కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జీవిస్తుంటాడు. అంతేకాదు ఇప్పటి వరకు వందల సినిమా ల్లో నటించి కోట్ల రూపాయలు సంపాందించిన గత 30 ఏళ్లుగా ఒకే సింగిల్‌ బెడ్‌రూమ్‌లో వుంటున్నాడు. అది కూడా సినిమా పరిశ్రమ కోసం ప్రభుత్వం కట్టించిన కాలనీకి సంబంధించినదే. 

అంతేకాదు కెరీర్‌ ప్రారంభం నుండి షూటింగ్‌లకు కూడా ఆటోలోనే వెళతాడు. నిర్మాతలు కార్లు పంపించిన సున్నితంగా తిరస్కరిస్తాడట.. ఇక నానా పటేకర్‌ జీవనశైలి తెలుసుకుంటూంటే మన తెలుగు విలక్షణ నటుడు ఆర్‌.నారాయణమూ ర్తి గుర్తుకు వస్తున్నాడు.. ఎందుకంటే ఆర్‌.నారాయణమూ ర్తి కూడా సింపుల్‌గా జీవిస్తూ, నానాపటేకర్‌ తరహాలోనే ఆటోలోనే ప్రయాణిస్తుంటాడు. ఎవరైనా కారులో తీసుకవెళతానన్న దండం పెట్టిమరి వద్దంటాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo