సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 11:45:25

మ‌హేష్ కూతురు చిన్న‌నాటి ఫోటో.. షేర్ చేసిన న‌మ్ర‌త‌

మ‌హేష్ కూతురు చిన్న‌నాటి ఫోటో.. షేర్ చేసిన న‌మ్ర‌త‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌హేష్ అత‌ని భార్య న‌మ్రత పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. సితార‌, గౌత‌మ్‌తో క‌లిసి చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నమ్ర‌త అయితే పాత జ్ఞాప‌కాల‌ని తవ్వి మ‌రి వాటిని త‌న ప‌ర్స‌న‌ల్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. తాజాగా సితార‌కి సంబంధించిన చిన్న నాటి ఫోటోని షేర్ చేసింది.

న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోలో సితార వివిధ ర‌కాలు ఎక్స్‌ప్రెష‌న్స్ ఉన్నాయి. ఎంతో ముద్దుగా ఉన్న సితార‌కి నెటిజ‌న్స్ నుండి కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది.  ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సితార త‌న తండ్రి సినిమా పాట‌ల‌కి డ్యాన్స్ చేయ‌డం లేదంటే ఫ‌న్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. 


logo